హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క, మాధవన్ లతో పాటు అంజలి, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. కాగా తాజాగా ఈ సినిమా నుండి అంజలి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. పోస్టర్ లో అంజలి వెరీ స్టైలీష్ లుక్ లో చేతిలో గన్ తో సీరియస్ మూడ్ లో కనిపిస్తోంది. అంజలి లుక్ చూస్తుంటే.. సినిమాలో ఆమె క్యారెక్టర్ కీలకమైనదని అనిపిస్తోంది. ఇక ఇటీవలే విడుదల అయిన ఈ సినిమా ప్రీ టీజర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమాలో సప్సెన్స్ ఎలిమెంట్స్ చాల బాగా వచ్చాయని.. సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్రీ క్లైమాక్స్ అండ్ ట్విస్ట్ లు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట. ఈ సినిమాలో అనుష్క ఆర్ట్ లవర్ గా కనిపించనుంది. ఇక మాధవన్ ఈ సినిమాలో సెల్లో ప్లేయర్ గా నటించనున్నాడు. ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ఇక ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. రచయిత కోన వెంకట్ తన బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
