‘జెర్సీ’ హిందీ రీమేక్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్

Shahid Kapoor

నాని నటించిన ‘జెర్సీ’ చిత్రం హిందీలోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఆయన క్రికెటర్ పాత్ర కోసం ట్రైనింగ్ కూడా మొదలుపెట్టారు. త్వరలో రెగ్యులర్ షూట్ మొడలుకానుంది. ఈలోపు నిర్మాతలు రిలీజ్ డేట్ ప్రకటించేశారు. 2020 ఆగష్టు 28వ తేదీన చిత్రం విడుదలకానుంది.

ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు నిర్మిస్తుండగా వీరిద్దరితో పాటు బాలీవుడ్ నిర్మాత ఆమన్ గిల్ నిర్మాణంలో భాగస్వామం తీసుకున్నారు. తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వర్షన్ ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. షాహిద్ కపూర్ ఇంతకుముందే తెలుగు చిత్రం ‘అర్జున్ రెడ్డి’ని హిందీలోకి ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి భారీ హిట్ అందుకొన్నారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతూ చేస్తున్న ఈ సినిమా మీద హిందీ ప్రేక్షకుల్లో అమితాశక్తి నెలకొని ఉంది.

Exit mobile version