క్రిస్టమస్ కంటే ముందే ‘వెంకీ మామ’

Venky Mama2

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉంది. అయితే కొన్ని రోజుల నుండి సినిమా విడుదల తేదీలో తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. మొదట సంక్రాంతి బరిలో నిలవాలని నిర్మాతలు అనుకున్నారు.

కానీ సినిమా పోటీ తీవ్రంగా ఉండటంతో ముందుగానే వచ్చేయాలని డిసైడ్ అయ్యారు. డిసెంబర్ నెలలోనే సరైన తేదీ కోసం వెతికిన టీమ్ క్రిస్టమస్ సెలవుల కంటే ముందే వచ్చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే 20న ‘డిస్కో రాజా, రూలర్, ప్రతిరోజు పండగే’ లాంటి సినిమాలున్నాయి. మంచి ఒపెంగ్స్ కావాలంటే సోలో రిలీజ్ ఉండాలి. అందుకే 20వ తేదీ కంటే ముందే వచ్చే ఆలోచనలో ఉన్నారు.

సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రంలో చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తుండగా, వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ మెరవనుంది.

Exit mobile version