నరేంద్ర మోదీ మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా బాలీవుడ్ స్టార్స్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని కొంతమంది సినీ ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి సౌత్ స్టార్స్ ను ఆహ్వానించలేదు. కానీ దిల్ రాజు, దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి కొంతమంది ప్రముఖులను మాత్రం ప్రత్యేకంగా ఆహ్వానించారు. కాగా అక్కడ జరిగిన అనుభవం గురించి తాజాగా బాలసుబ్రహ్మణ్యం సోషల్ మీడియా ద్వారా ప్రేక్షుకులతో పంచుకున్నారు.
బాలసుబ్రహ్మణ్యం ఆ సమావేశం పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘ప్రధాని మోదీ తన నివాసంలో అక్టోబర్ 29న ఏర్పాటు చేసిన సమావేశానికి నేను కూడా హాజరయ్యాను. సమావేవం జరుగుతున్న ఆ ప్రదేశంలోకి ప్రవేశించగానే అక్కడి సెక్యూరిటీ సిబ్బంది మా ఫోన్లను తీసుకుని, మాకు టోకెన్స్ ఇచ్చారు. కానీ మేము లోపలికి వెళ్ళాక కొంతమంది స్టార్లు మాత్రం ప్రత్యేకంగా ప్రధానితో సెల్ఫీలు దిగుతున్నారు. ఈ సంఘటన చాలా అసంతృప్తిని కలిగించింది’’ అని ఎస్పీ బాలు పోస్ట్ చేశారు.
