ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ లో రవితేజ !

raviteja

రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం తన మాడ్యులేషన్ తోనే అద్భుతమైన కామెడీని పండించగలడు. అయితే కిక్ తరువాత రవితేజ్ మళ్లీ ఆ రేంజ్ కామెడీ సినిమా చెయ్యలేదు. అయితే తాజాగా రవితేజ అలాంటి కామెడీ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన మంచి కామెడీ కథతో నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ విషయాన్ని రచయిత ప్రసన్న కుమార్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

కాగా స్క్రిప్ట్ కూడా ఇప్పటికే పూర్తి అయిందట. ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని… సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ మంచి కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందని సమాచారం. త్రినాథరావ్ నక్కిన గత చిత్రాలు కూడా ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి సినిమాలు మంచి ఎంటెర్టైమెంట్ తో సాగిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించనున్నారు. ర‌వితేజ – గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో వచ్చే సినిమా తరువాత ఈ సినిమా మొదలు కానుంది.

Exit mobile version