నవంబర్ 15న ‘విజయ సేతుపతి’ !

Vijay1

విజయ సేతు పతి, రాశీ ఖన్నీ జంటగా విజయా ప్రొడక్షన్ వారి నిర్మాణంలో తమిళంలో నిర్మాణమవుతున్న ‘సంగతమిళ్’ మూవీ ని హార్షిత మూవీస్ వారు తెలుగులో ‘విజయసేతుపతి’ పేరుతో విడుదల చేయనున్నారు. రెండు భాషల్లో నవంబర్ 15న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

కాగా త్వరలోనే ట్రెయిలర్ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేసేందుకు నిర్మాతలు నిర్ణయించారు. విజయసేతుపతి తో పాటు చిత్రయూనిట్ అందరూ అంటెండ్ అవుతారు. ఈ సందర్భంగా నిర్మాత రావురి వి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘విజయ్ సేతుపతి ’ తెలుగు ప్రక్షేకుల ఆదరణ పొందుతుంది అని నమ్ముతున్నాను. విజయ్ సేతుపతి సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రాశీఖన్నా,నాజర్ , నివేద పేతురాజ్, అశుతోష్ రాణా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన వారే కావడంతో ఈ సినిమా స్ట్రైయిట్ సినిమాగానే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ సినిమా లో యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేకమైన ప్రశంసలు దక్కుతాయి’’ అన్నారు.

Exit mobile version