‘ఖైదీ’ దర్శకుడికి కమల్ బంపర్ ఆఫర్

kamal

తమిళ పరిశ్రమ నుండి వచ్చిన తాజా చిత్రాల్లో ‘ఖైథి’ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ‘ఖైదీ’ సైతం ప్రేక్షకుల్ని మెప్పించి లాభాల్ని ఆర్జిస్తోంది. ఈ విజయంతో ఆ చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ హాట్ కేక్ అయిపోయాడు. పెద్ద హీరోలు, నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం స్టార్ హీరో విజయ్ తో ఒక సినిమా స్టార్ట్ చేశాడు. ‘ఖైదీ’ విడుదలకు ముందే సెట్టైన ప్రాజెక్ట్ ఇది. తాజాగా మరొక పెద్ద హీరో కమల్ హాసన్ సైతం తన సొంత బ్యానర్లో తనతోనే సినిమా చేసే ఆఫర్ ఇచ్చారట ఆ యువ దర్శకుడికి. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ఫైనల్ అవుతుందని వినికిడి. ఇక లోకేష్ కార్తీతో ‘ఖైదీ’ ప్రీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. విజయ్ సినిమా ముగియగానే ఇది మొదలయ్యే అవకాశాలున్నాయి.

Exit mobile version