థమన్ సూపర్ ఫామ్ లోకి వచ్చారు. ఆయన టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు చిన్న హీరోల సినిమాల వరకు దాదాపు అరడజనుకు పైగా చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. ఇక గత నెలరోజులలో అలవైకుంఠపురంలో చిత్రం నుండి రెండు సాంగ్స్ విడుదల చేయగా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. రెండు పాటలు బాగా ప్రేక్షకులకు చేరువ కావడంతో మూవీపై బజ్ క్రియేట్ ఐయ్యింది. దీనితో అలవైకుంఠపురంలో టీం మూడవ పాటను కూడా సిద్ధం చేస్తున్నారని సమాచారం. త్వరలోనే మూడవ పాటను కూడా యూట్యూబ్ లో విడుదల చేస్తారట.
ప్రస్తుతం విడుదల చేసిన రెండు పాటలలో ‘సామజవరగమన’ సాంగ్ మెలోడీ కాగా, ‘రాములో రాములా’ మాస్ బీట్ సాంగ్. మరి మూడవ పాట ఎలా ఉంటుందో చూడాలి. విడుదలకు చాలా రోజులకు ముందే పాటలను జనాల్లోకి తీసుకెళ్లి సినిమాకు హైప్ క్రియేట్ చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ ఐయ్యిందనే చెప్పాలి. ఇక త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో టబు,సుశాంత్ ఇతర కీలకపాత్రలలో కనిపించనున్నారు. అలవైకుంఠపురంలో మూవీని వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
