ఐ.టి.రంగం నుంచి మరో దర్శకుడు !

it

శేఖర్ కమ్ముల మొదలుకుని గౌతమ్ తిన్ననూరి వరకు పలువురు ఐ.టి.రంగ నిపుణులు తెలుగు సినిమా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తాజాగా తెలుగు చిత్రసీమకు ఐ.టి.రంగం నుంచి మరో వ్యక్తి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. పేరు.. ‘అనిల్ పంగులూరి’. యు అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్-శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఓ ఆహ్లాదభరిత చిత్రం ద్వారా అనిల్ పంగులూరి దర్శకుడిగా పరిచయం కానున్నారు. దర్శకనిర్మాతల ఉత్తమాభిరుచికి అద్దం పడుతూ.. తెలుగుదనం ఉట్టి పడే పేరును ఈ చిత్రం కోసం ఎంపిక చేశారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం పేరును త్వరలోనే ప్రకటించనున్నారు.

దాదాపుగా అందరూ కొత్తవాళ్ళతో రూపొందుతున్న ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్. వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసడ, ఛాయాగ్రహణం: సంతోష్ షనమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, సహ నిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, సమర్పణ: పద్మనాభరెడ్డి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి.

Exit mobile version