మళయాళ వర్షన్ పైకి మరలిన బన్నీ ఫోకస్

Allu arjun

ఈసారి బన్నీ-త్రివిక్రమ్ జోడీ గట్టిగా కొట్టేలా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అలవైకుఠపురంలో చిత్రంపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో ఇప్పటికే వీరు సక్సెస్ ఐయ్యారు. థమన్ స్వర కల్పనలో వచ్చిన రెండు పాటలు యూట్యూబ్ లో ఒక రేంజ్ లో పేలాయి. ఈ రెండు సాంగ్స్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఆడియెన్స్ లో కి పూర్తిగా చొచ్చుకొని వెళ్లిన ఈ పాటలు చిత్రానికి కావలసినంత ప్రచారం కల్పించాయి. అలవైకుంఠపురంలో ప్రొమోషన్స్ విషయంలో బన్నీ,త్రివిక్రంల ప్రయోగం సూపర్ సక్సెస్ సాధించిందని చెప్పాలి.

బన్నీ చిత్రాలు కేరళలో మంచి ఆదరణ దక్కించుకుంటాయి. అక్కడ బన్నీకి చెప్పుకోదగ్గ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనితో అలవైకుంఠపురంలో మూవీ మలయాళంలో కూడా విడుదల చేస్తున్నారు. కాగా మలయాళ వర్షన్ ప్రొమోషన్స్ పై కూడా త్రివిక్రమ్,బన్నీ ద్రుష్టి పెట్టారు. నేడు ఉదయం 11గంటలకు అల వైకుంఠపురలో చిత్ర మలయాళ టైటిల్ పోస్టర్ ని విడుదల చేస్తున్నారు. నిన్న ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. మరి తెలుగులో వలే మలయాళంలో కూడా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ విడుదల చేస్తారేమో చూడాలి. బన్నీ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న ఈమూవీలో టబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Exit mobile version