‘తలైవి’లో ఆసక్తికరమైన విషయాలు !

jayalalitha

తమిళ ప్రజల అభిమాన దివంగత ముఖ్యమంత్రి అమ్మ ‘జయలలిత’ జీవితం ఆధారంగా, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథాకథనాలతో తమిళ డైరెక్టర్ ‘ఏ ఎల్ విజయ్’ దర్శకత్వంలో ‘తలైవి’ అనే టైటిల్ తో జయలలిత బయోపిక్ ను రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో పలు ఆసక్తికరమైన విషయాలు కూడా ఉంటాయట. ముఖ్యంగా రాజకీయంగా జయలలిత పై జరిగిన కుట్రలు, అసెంబ్లీలో ఆమె పై జరిగిన దాడుల్లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి పాత్ర ఎంత ఉంది, అలాగే శోభన్ బాబు – జయలలిత మధ్య అనుబంధం పై వచ్చిన రూమర్స్ లో వాస్తవం ఎంత.. లాంటి అంశాలను మొత్తం ఉన్నది ఉన్నట్లు చూపించనున్నారట.

అలాగే జయలలిత – ఎంజీఆర్ మధ్య ప్రేమ, సాన్నిహిత్యం ఎంత బలమైనదో కూడా ఈ బయోపిక్ లో క్లారిటీగా చూపించనున్నారు. మరి జయలలితకి కుమార్తె ఉందని ఆరోపణలు వచ్చాయి. మరి ఆ విషయాన్ని కూడా సినిమాలో టచ్ చేస్తారేమో చూడాలి. కాగా జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. ఇప్పటికే ఈ బయోపిక్ కోసం ప్రత్యేకంగా తమిళం కూడా నేర్చుకుంటుంది ఈ బాలీవుడ్ క్వీన్. మొత్తానికి అమ్మ బయోపిక్ లో ఆమె జీవితంలోని ఎవ్వరికీ తెలియని విషయాలు కూడా తెలియనున్నాయి. కాగా ఈ బయోపిక్ తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా రిలీజ్ కానుంది.

Exit mobile version