పోస్ట‌ర్ లాంచ్‌ లో ‘నా మాటే విన‌వా’ !

naa

శ్రీ‌శివాని ఆర్ట్స్& పి.ఎస్‌.మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై లింగ‌స్వామి వేముగంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌శంక‌ర్‌గౌడ్ నిర్మిస్తున్నచిత్రం నా మాటే విన‌వా. ప్ర‌ముఖ క‌మెడియ‌న్ గౌత‌మ్‌రాజు త‌న‌యుడు కృష్ణ, కిర‌ణ్‌చ‌త్వాని జంట‌గా న‌టిస్తున్నారు. సాయికుమార్‌, పోసానికృష్ణ‌ముర‌ళి, కోటేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ ఛైర్మ‌న్ మోహ‌న్ వ‌డ్ల‌పాటి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఫిల్మి ఛాంబ‌ర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ చైర్మ‌న్ వ‌డ్ల‌పాటి మాట్లాడుతూ… న‌న్ను అతిథిగా పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రొడ్యూస‌ర్స్ త‌ర‌పున ప్ర‌తి చిన్న సినిమాకి మా త‌ర‌పు స‌హాయ స‌హ‌కారాలు ఎప్పుడూ ఉంటాయి. ఈ సినిమాకి కూడా మా స‌హ‌కారాలు త‌ప్ప‌కుండా అందిస్తాము. ఈ మూవీ యూనిట్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్ అని అన్నారు.

డైరెక్ట‌ర్ లింగ‌స్వామి మాట్లాడుతూ… నాది తొమ్మిద‌వ సినిమా నేనుగ‌తంలో కూడా అన్నీ మంచి చిత్రాలు చేశాను. 6 నంది అవార్డుల‌ను కూడా అందుకున్నాను. ప్రొడ్యూస‌ర్ నాకు మంచి మిత్రుడు. యూత్‌ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ ఇది. హీరో కృష్ణ యూత్ ఎన‌ర్జిటిక్ హీరో. కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్‌లో మంచి ఫైట‌ర్ అన్న పేరు వ‌చ్చింది. ఈ చిత్రంలో మంచి పెర్ఫార్మ‌ర్ అని పేరు వ‌స్తుంది. ప్రొడ్యూస‌ర్స్ ఖ‌ర్చుకి ఎక్క‌డా వెన‌కాడ‌లేదు. రెండు పాట‌లు మ‌లేషియాలో తీశాం. కోటేశ్వ‌ర్‌రావు, తిరుప‌తి దొరై ఈ చిత్రంలో మంచి పాత్ర‌లు పోషించారు. ఐదు పాట‌లు ఏలేంద్ర‌గారు అందించారు. చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. కెమెరామెన్ మ‌నోహ‌ర్‌గారు చాలా రిచ్‌గా తీశారు. స‌హ‌క‌రించిన జ‌గ‌దీశ్వ‌రావుగారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఈ సినిమా సెన్సార్‌కి అప్లై చేశాం సెన్సార్ అవ్వ‌గానే విడుద‌ల తేదీని ఖ‌రారు చేస్తాము. బీటెక్ స్టూడెంట్స్ నిశ్చితార్ధం త‌రువాత ఇద్ద‌రూ క‌లిసి ప్ర‌యాణించే క‌థాంశంతో చివ‌రికి మంచి ఫ్రెండ్స్ అయి పెళ్లి వ‌ర‌కు ఎలా వ‌చ్చారు అనేది చిత్ర క‌థ‌. క్లైమాక్స్‌లో సాయికుమార్ గారి పాత్ర చాలా కీల‌కం. మా ఎంటైర్ యూనిట్ అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

Exit mobile version