వర్మ మూవీ టైటిల్ మారిందట…, కొత్త టైటిల్ ఏంటంటే..?

rgv

గత కొద్ది రోజులుగా వర్మ తీస్తున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సంచలంగా మారింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలకంగా ఉన్న నాయకులను పోలిన పాత్రలతో ఏకంగా రెండు కులాలను ప్రస్తావిస్తూ టైటిల్ పెట్టడానికి చాలా మంది విమర్శిస్తున్నారు.ఇది కులాల మధ్య కుంపటి రాజేసేదిలా ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఐతే ఎవరేమనుకున్నా, ఐ డోంట్ కేర్ అంటున్న వర్మకు సెన్సార్ సభ్యులు షాక్ ఇచ్చారు.
వారు కమ్మ రాజ్యంలో కడపరెడ్లు టైటిల్ మార్చాలని సూచించారట. దీనితో ఈ చిత్ర టైటిల్ ని ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అని మార్చారని సమాచారం. కాగా దీనివలన వర్మకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇప్పటికే వివాదాలతో ఈ మూవీకి కావలసినంత ప్రచారాన్ని వర్మ సంపాదించారు. గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ మూవీకి భారీగానే క్రేజ్ వచ్చి చేరింది. ఇక రేపు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల అవుతుంది. విడుదలకు ముందే ఎన్నో వివాదాలకు కారణమైన ఈ చిత్రం, విడుదల తర్వాత మరెన్ని వివాదాలను లేవనెత్తనుందో.

Exit mobile version