మహేష్ మూవీ రికార్డులు మొదలయ్యాయి.!

mind blockk

సరిలేరు నీకెవ్వరు టీజర్ తో ఫ్యాన్ ని ఊపేసిన మహేష్ నిన్న మొదటి సాంగ్ విడుదల చేసి అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లారు. మాస్ ఐటమ్ బీట్స్ కి పెట్టింది పేరైన దేవిశ్రీ అందించిన మైండ్ బ్లాక్ సాంగ్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. సంక్రాంతి కి వెండి తెరపై ఈ సాంగ్ పటాసులా పేలడం ఖాయంగా కనిపిస్తుంది. బ్లేజ్ మరియు రనీనా రెడ్డి పాడగా శ్రీమణి, దేవీశ్రీ సాహిత్యం అందించారు.

ఇక ఈ సాంగ్ ఇప్పటికే 5మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ దాటివేసింది. విడుదలై ఇరవై నాలుగు గంటలు కూడా ముగియక ముందే ఇన్ని వ్యూస్ దక్కించు కోవడం రికార్డ్ గా మారింది. సినిమా విడుదలకు ముందే టీజర్ మరియు సాంగ్స్ తో మహేష్ రికార్డుల వేట మెదలెట్టారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, వచ్చే నెల 11న విడుదల కానుంది.

Exit mobile version