బన్నీ సాంగ్ అలవోకగా వంద మిలియన్స్ దాటేసింది.

ramulo1

అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో మూవీపై ఉన్న అంచనాలు అంతా ఇంతా కాదు. సంక్రాంతి కానుకగా వస్తున్న బన్నీ చిత్రం సూపర్ హిట్ కావడం ఖాయం అని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఈ చిత్రంపై ఇంతటి భారీ హైప్ క్రియేట్ కావడానికి థమన్ పాటలు కూడా ఒక కారణం. ఈ చిత్రం కొరకు థమన్ అందించిన మూడు సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. కాగా అలవైకుంఠపురంలో చిత్రంలోని ‘రాములో రాములా’సాంగ్ 100 మిలియన్ వ్యూస్ కి చేరుకొని రికార్డు సృష్టించింది. అతివేగంగా 100 మిలియన్స్ వ్యూస్ సాధించిన మొదటి తెలుగు సాంగ్ గా రాములో రాములా’ నిలిచింది.

ఈ చిత్రం నుండి విడుదలైన మొదటి సాంగ్ ‘సామజవరగమనా’ కూడా 100 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యా ట్రిక్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

Exit mobile version