హీరో విజయ్ దేవరకొండ స్ట్రీట్ డాన్సర్స్ 3 సినిమాని ఉద్దేశిస్తూ ‘నేను నా జీవితంలో ఇలాంటి సినిమా చేయలేను…చూసి ఎంజాయ్ చేయడమే తప్ప’ అన్నారు. వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ జంటగా దర్శకుడు రెమో డిసౌజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డాన్స్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరున్న ప్రభుదేవా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 24న విడుదల కానుంది. ఈ మూవీ తెలుగులో కూడా విడుదల కానుంది.
అత్యున్నతనమైన డాన్స్ ప్రమాణాలతో నరాలు తెగే డాన్స్ మూవ్మెంట్స్ తో ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో పాటు ఇలాంటి మూవీ నేను చేయలేనని వరుణ్ ధావన్ పై పరోక్షంగా ప్రశంసలు కురిపించారు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నటిస్తున్నారు. రాశి ఖన్నా ప్రధాన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న వాలైంటైన్స్ డే కానుకగా విడుదల కానుంది.
Ee life time lo idhi nenu cheyalenu, cinema lo chusi enjoy cheyatame ????
Wishing brother @Varun_dvn @ShraddhaKapoor @remodsouza @PDdancing and all the street dancers the very best for #StreetDancer3D
Releasing in Telugu on the 24th of Jan 2020. https://t.co/CTtA30ZPVx
— Vijay Deverakonda (@TheDeverakonda) December 19, 2019
