టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో ఒక్క సినిమా చేసింది లేదు. కానీ ఆయన పాపులారిటీ అక్కడ ఒక రేంజ్ లో ఉంది. బాలీవుడ్ బడా నిర్మాతలు ఆయనతో సినిమాలు తీయడానికి పోటీపడుతున్నారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఎప్పటినుండో విజయ్ తో బాలీవుడ్ మూవీ చేయాలని తహతహలాడుతున్నారు. తాజాగా మరో బడా నిర్మాణ సంస్థ విజయ్ కి భారీ ఆఫర్ ఇచ్చిందట. బాలీవుడ్ బాక్సాఫీస్ హిట్స్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన యష్ రాజ్ ఫిలిమ్స్ ఆయనతో ఓ బై లింగ్వల్ మూవీ చేయడానికి సంప్రదించారట. ఆ మూవీ కొరకు పారితోషకం కూడా భారీగా ఆఫర్ చేశారని తెలుస్తుంది. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్త.
ఐతే ఇప్పటికే తెలుగులో అనేక ప్రాజెక్ట్స్ కమిటై ఉన్న విజయ్ ఈ ఆఫర్ ని అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి. విజయ్ దేవరకొండ నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రీకరణ దశలో ఉండగా పూరి జగన్నాథ్ తో ఫైటర్ మరియు శివ నిర్వాణ దర్శకుడిగా దిల్ రాజు తో ఓ మూవీ విజయ్ దేవరకొండ చేయాల్సివుంది. వచ్చే ఏడాది ఈ రెండు చిత్రాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి. ఇక దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల కానుంది.
