‘భాగమతి’ హిందీ రీమేక్ లేటెస్ట్ అప్ డేట్ !

Bhaagamathie

స్వీటీ అనుష్క గత సంవత్సరం భాగమతిగా ప్రేక్షకుల ముందుకొచ్చి సప్సెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఓ రేంజ్ లో భయపెట్టింది. మొత్తానికి హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ముఖ్యంగా భాగమతి సినిమాలో అనుష్క నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దర్శకుడు అశోక్ ఈ సినిమాని ఓ భిన్నమైన కథాంశంతో హారర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కించారు. ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. ఎప్పటినుండో భాగమతి సినిమా హిందీలో రీమేక్ కానుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు అందుకు ఇటీవలే రంగం సిద్ధం అయింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. పైగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. దాంతో హిందీలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక భాగమతి చిత్రాన్ని హిందీలో దుర్గావతిగా తెరకెక్కిస్తుండగా, హీరోయిన్ భూమి పెడ్నేకర్ అనుష్క రోల్ చేస్తున్నారు. విక్రమ్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో భాగమతి చిత్రానికి దర్శకత్వం వహించిందే కూడా ఈయనే. వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. మరి అనుష్క ‘భాగమతి’ ‘దుర్గావతి’గా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో చూడాలి.

Exit mobile version