అంచనాలు పెంచేస్తున్న రొమాంటిక్ పోస్టర్స్.

romantic1

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రొమాంటిక్. అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈమూవీ నుండి నేడు ‘నువ్వు నేను ఈ క్షణం’ అనే సాంగ్ రానుంది. ఐతే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అందరూ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు పూరి. ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న కేతిక శర్మ టాప్ లెస్ గా ఉండగా ఆమెను ఆకాష్ పూరి హగ్ చేసుకున్న పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ చిత్రం నుండి వస్తున్న పోస్టర్స్ లో రొమాంన్స్ డోస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ మూవీ నుండి వచ్చే పోస్టర్స్ యూత్ కి కిక్కెస్తున్నాయి. పూరి సారథ్యంలోని రొమాంటిక్ టీం పోస్టర్స్ తోనే సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు.

గత చిత్రం ‘మెహబూబా’ సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడు ఆకాష్ పూరి. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తుండగా వేసవికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆకాష్ పూరికి జోడీగా కేతిక శర్మ నటిస్తోంది.

Exit mobile version