తెలుగు రాష్ట్రాలలో ప్రతిరోజూ పండుగే ఫస్ట్ డే కలెక్షన్స్

prathiroju pandage

సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా యూత్ ఫుల్ ఎంటర్టైనింగ్ చిత్రాల దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ప్రతిరోజూ పండుగే చిత్రం నిన్న విడుదలై డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. ఫన్ అండ్ ఎమోషన్స్ తో కూడిన ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్ నటన హైలెట్ గా నిలిచింది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిరోజూ పండుగే బాగానే రాబట్టింది. డీసెంట్ టాక్ తో బాక్సాపీస్ ఓపెన్ చేసిన ప్రతిరోజూ పండుగే మొదటిరోజు ఆంధ్రా మరియు తెలంగాణాలలో 3.4 కోట్ల షేర్ రాబట్టింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో ఇదే బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అని సమాచారం.

మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ప్రతిరోజు పండుగే చిత్రాన్ని నిర్మించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ వసూళ్లు నేడు మరియు రేపు పెరిగే అవకాశం కలదు. థమన్ అందించిన సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది.

Exit mobile version