పవన్ కళ్యాణ్ లుక్ మార్చుకుంటారా.. లేదా

Pawan Kalyan

‘పింక్’ రీమేక్ తో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైన సంగతి తెలిసిందే. అయితే పవన్ నుండి మాత్రం ఇంకా ఎలాంటి క్లారిఫికేషన్ రాలేదు. దీంతో అభిమానుల్లో ఒకింత క్కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. దీంతోపాటే ఒకవేళ పవన్ సినిమా చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడా లేదా అనే అనుమానం కూడా మొదలైంది. ఎందుకంటే పవన్ రాజకీయపరమైన పనుల్లో పడి పూర్తిగా తన లుక్ మీద కంట్రోల్ వదిలేశారు.

ప్రజెంట్ లుక్లో ఆయన సినిమా చేయడం దాదాపు కష్టమే. లుక్ మార్చుకుంటేనే ప్రేక్షకులకు పాత పవన్ ను చూసినట్టు ఉంటుంది. అయితే పవన్ మాత్రం లుక్ ఛేంజ్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో అసలు పవన్ సినిమా చేస్తాడా లేదా ఒకవేళ చేస్తే ఇదే లుక్ తో చేస్తారా, అలానే చేస్తే కష్టం కదా అనే అనుమానాలు మొదలయ్యాయి. మరి ఈ ప్రశ్నలకు పవన్ నుండి త్వరలో జవాబు ఎమైనా వస్తుందేమో చూడాలి.

Exit mobile version