వెంకటేష్, నాగ చైతన్య చేసిన మల్టీ స్టారర్ వెంకీ మామ చిత్రం విడుదలైన మూడవ వారం కూడా థియేటర్స్ దగ్గర సందడి చేస్తుంది. మామ అల్లుళ్ళ మధ్య జరిగే కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం వసూళ్ల పరంగా కూడా బాగా రాబట్టినట్టు తెలుస్తుంది. వెంకీ మామ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 37కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపగా అందులో దాదాపు రికవర్ అయినట్టు సమాచారం. చాలా చోట్ల బయ్యర్లు బ్రేక్ ఈవెన్ కి చేరుకున్నారట.
ఇక ఈ మూవీ ఇప్పటివరకు 72కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు అధికారంగా ఓ పోస్టర్ విడుదల చేశారు. విడుదలైన వారానికే తీవ్ర పోటీని ఎదుర్కొన్న వెంకీ మామ చిత్రం బాక్సాఫీస్ వద్ద గట్టిగానే నిలుచుంది. దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. రాశి ఖన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటించారు. థమన్ సంగీతం అందించారు.
