ఆ హీరోతో అందుకే విడిపోయా అంటున్న రష్మిక

Rashmika1

టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ రష్మిక మందాన తన లవ్ మరియు బ్రేక్ అప్ గురించి నోరువిప్పింది. రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో కొంత కాలం ప్రేమాయణం నడిపారు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగిన తరువాత విడిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. వీరిద్దరి పెళ్లి ఆగిపోవడానికి కారణం అప్పట్లో రష్మిక అనేక సినిమాలతో బిజీ అయ్యారట. దీనితో కొంత కాలం పెళ్లి వాయిదా వేద్దాం అని నిర్ణయించుకున్నారట. ఐతే రష్మిక మరిన్ని అవకాశాలతో మరింత బిజీ కావడంతో రక్షిత్ శెట్టి తో పెళ్లి ఆగిపోయిందని ఆమె చెప్పుకొచ్చారు.

ఇక రష్మిక మందాన టాలీవుడ్ లో బడా హీరోలతో చేస్తున్నారు. మహేష్ కి జంటగా నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉండగా, అల్లు అర్జున్, సుకుమార్ చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్నారు. అలాగే యంగ్ హీరో నితిన్ సరసన భీష్మ చిత్రంలో కూడా రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.

Exit mobile version