యంగ్ హీరో నాగ శౌర్య నటించిన అశ్వథామ మూవీ టీజర్ గ్రాండ్ గా నేడు విడుదలైంది. నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ అశ్వథామ టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఈ మూవీ టీసర్ పై సమంత అక్కినేని స్పందించారు. ఆమె ట్విట్టర్ వేదికగా నేను ఎంతగానో ఎదురుచూస్తున్న అశ్వథామ టీజర్ వచ్చేసింది. టీజర్ చాలా ఇంప్రెస్సివ్ గా ఉందని.. అశ్వథామ కొరకు నాగ శౌర్య చాల కష్టపడినట్టున్నారు అని ఆమె వరుస ట్వీట్స్ చేశారు. నిజానికి అశ్వథామ టీజర్ రిలీజ్ వేడుకకు సమంత హాజరుకావాల్సివుండగా కొన్ని అనివార్య కారణాల వలన ఆమె రాలేకపోయారని తెలుస్తుంది.
తన స్వార్ధం కోసం అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకొనే ఓ మాఫియా లీడర్ ని నాగ శౌర్య ఎలా ఎదుర్కొన్నాడు అనే పాయింట్ తో ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తుంది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో సీరియస్ గా సాగిన అశ్వథామ టీజర్ అలరించేదిగా ఉంది. ఈ చిత్రానికి ఉషా ములుపురి నిర్మాతగా వ్యవహరిస్తుండగా శ్రీ చరణ్ పాకల సంగీతం అందిస్తున్నారు.
https://twitter.com/Samanthaprabhu2/status/1210432748105547776
https://twitter.com/Samanthaprabhu2/status/1210447949349572610
