వెకేషన్ కి వేళాయెరా అంటున్న మహేష్..!

mahesh

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీ తో వెకేషన్ కి బయలుదేరారు. ఆయన సతీమణి నమ్రత పిల్లలు గౌతమ్, సితార్ తో కలిసి వరల్డ్ టూర్ కి పయనమయ్యారు.ఎప్పుడూ సినిమాలు, వ్యాపార ప్రకటనలతో క్షణం తీరిక లేకుండా గడిపే మహేష్ ఏ కొద్ది విరామం దొరికినా కుటుంబంతో కలిసి వెకేషన్ కి వెళుతూ ఉంటారు. మహర్షి మూవీ అనంతరం కుటుంబంతో కలిసి వరల్డ్ టూర్ వెళ్లిన మహేష్, సరిలేరు నీకెవ్వరు మూవీ షూటింగ్ విరామంలో కూడా టూర్ కి వెళ్లడం జరిగింది.

సంక్రాంతికి రానున్న సరిలేరు నీకెవ్వరు మూవీ షూటింగ్ పూర్తి కావడంతో మహేష్ కుటుంబంతో కలిసి విహారానికి వెళుతున్నట్లు తెలుస్తుంది. స్టార్ హీరోగా ఉన్న మహేష్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబంతో గడపడానికి కొంత సమయం కేటాయిస్తారు. ఇక అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సరిలేరు నీకెవ్వరు మూవీలో మహేష్ సరసన రష్మిక మందాన నటిస్తుంది. దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

Exit mobile version