ఇంటర్వ్యూ: నటరాజ్- హీరోగా కాదు నటుడిగా ఎదగాలనుకుంటున్నాను.

ullala

 

నటరాజ్, అంకిత మహరాన, నూరిన్ షరీఫ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్ హారర్ మూవీ ఉల్లాల ఉల్లాల. ఒకప్పటి టాలీవుడ్ విలన్ సత్య ప్రకాష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.హీరో నటరాజ్ సత్య ప్రకాష్ కుమారుడు కావడం విశేషం. 2020 జనవరి 1న నూతన సంవత్సర కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సంధర్భంగా హీరో నటరాజ్ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.

ఉల్లాల ఉల్లాల చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

ఎలాగైనా సినీ పరిశ్రమలో పెద్ద దర్శకుడిగా ఎదగాలనుకొనే యువకుడిగా నా పాత్ర ఉంటుంది. అలాగే డబ్బు మీద కూడా బాగా వ్యామోహం ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు కలిగిన ఒక అబ్బాయికి మరో వైపు ఒక ప్రేమకథ కూడా ఉంటుంది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న వైవిధ్యమైన రోల్ నాది.

 

టైటిల్ ఏమిటీ.. చాలా డిఫరెంట్ గా పెట్టారు?

అనేక హిట్ పాటలలో ఉల్లాలా ఉల్లాల అనేది ఒక ఊతపదం. సినిమా మొత్తం స్క్రిప్ట్ సిద్ధం చేశాక..ఏమి టైటిల్ పెట్టాలని ఆలోచించినప్పుడు ఈ ఉల్లాల ఉల్లాల అనే టైటిల్ బాగుంటుందని అలోచించి పెట్టడం జరిగింది.

 

తెలుగులో మొదటి సినిమా అనుకుంటా..ఎలా ఫీల్ అవుతున్నారు?

చాలా నెర్వస్ గా ఉంది అలాగే చాలా ఎక్సయిటింగ్ గా కూడా ఉంది. నాన్న తెలుగులో అనేక చిత్రాలలో నటించి తానేమిటో నిరూపించుకున్నారు. అందుకే మూవీ రిసల్ట్ కోసం ఎదురు చూస్తున్నాను.

 

ఈ చిత్రానికి మీ నాన్నే దర్శకుడు కదా, సెట్స్ లో మీ రేలషన్ ఎలా ఉండేది?

ఫ్యామిలీ సెంటిమెంట్స్ , రిలేషన్స్ సెట్స్ లో ఉండవు. రిలేషన్స్ వేరు ప్రొఫెషన్ వేరు అనేది నా నమ్మకం. ఆయనలో నాకు బాగా నచ్చిన అంశాలు ఫంక్చువాలిటీ మరియు డిసిప్లిన్ . కొన్ని సార్లు ఆయనే స్వయంగా నటించి చూపించే వారు. ఆయన నాకు చాలా విషయాలు నేర్పారు.

 

ఇంకా ఏమైనా కొత్త సినిమాలు చేస్తున్నారా?

అమ్మ దీవెన అనే ఓ చిత్రంలో నటిస్తున్నాను. ఆ చిత్రం దాదాపు పూర్తయింది. ఫిబ్రవరి లేదా మార్చి లో విడుదల అవుతుంది. ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్స్ తో తెరకెక్కే మరో చిత్రంలో నటించే అవకాశం కలదు.

 

మీ నాన్న గారిలా విలన్ రొల్స్ కూడా చేస్తారా?

ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే నేను హీరోగా కాదు ఒక మంచి నటుడు కావాలనుకుంటున్నాను. తెలుగులో మంచి పాత్ర చేసే అవకాశం వస్తే విలన్ గా చేయడానికైనా సిద్ధం.

 

హీరో కావడానికి ఏమైనా జాగ్రతలు తీసుకున్నారా?

గతంలో నేను వంద కేజీలకు పైగా బరువు ఉండేవాడిని హీరో కావడం కోసం బరువు తగ్గాను. డాన్స్, హార్స్ రైడింగ్, జిమ్నాస్టిక్స్ వంటివి నేర్చుకున్నాను.

Exit mobile version