సౌత్ స్టార్ దర్శకుల్లో ఒకరైన మురుగదాస్ తమిళంలో ఎన్నో హిట్లు అందుకున్నారు. కానీ తెలుగులో విజయం సాధించాలన్న ఆయన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘స్టాలిన్’, మహేష్ బాబుతో చేసిన ‘స్పైడర్’ రెండూ నిరుత్సాహపరిచాయి. ఇలాంటి నెపథ్యంలో ఆయన త్వరలో జూ. ఎన్టీఆర్ హీరోగా ఒక చిత్రం చేస్తారని, త్వరలోనే ప్రాజెక్ట్ ఉంటుందనే టాక్ మొడలైంది. ఇది కాస్త హాట్ టాపిక్ అయింది.
తాజాగా ‘దర్బార్’ ప్రమోషన్లలో పాల్గొన్న మురుగదాస్ ఈ వార్తలు నిజం కాదని తేల్చారు. ప్రస్తుతం ‘దర్బార్’ పనుల్లో బిజీగా ఉన్నానని, ఇంకా తర్వాతి సినిమా గురించి ఆలోచించలేదని అన్నారు. అంతేకాదు ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయాలని అనుకున్నానని, ఆయనకు చాన్నాళ్ల క్రితం కథ కూడా చెప్పానని, కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
