మెగాస్టార్ – కొరటాల సినిమా లేటెస్ట్ అప్ డేట్ !

Chiru koratala

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కలయికలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని దేవాలయాలతో పాటు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన గవర్నమెంట్ ఆఫీసర్ గా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపిస్తారని గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాని కూడా సైరాలా పాన్ ఇండియా మూవీగా చేయాలని ఆలోచిస్తోందట చిత్రబృందం. అన్నట్టు ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన త్రిషను హీరోయిన్ గా తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని తెరకెక్కిస్తే అప్పుడు త్రిష ప్లేస్ లో బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవచ్చు.

ఇక కొరటాల చిరు కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న కథను తయారు చేసారట. ఈ సినిమాని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి.. 2020లో స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్‌ గా ఆగస్టు 14న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోన్నారు. ఇక ఈ చిత్రానికి పని చేసే టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version