గత రాత్రి జరిగిన సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ ముఖ్య అతిధిగా హాజరై సందడిచేశారు. కార్యక్రమం చివర్లో సుదీర్ఘ ప్రసంగం చేసిన మెగాస్టార్ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక అభ్యర్థన చేశారు. తెలుగు చిత్రపరిశ్రమలో హీరోగా 350కి పైగా చిత్రాలలో నటించిన దర్శక నిర్మాత సూపర్ స్టార్ కృష్ణ గారికి చిత్ర పరిశ్రమలో ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అన్నారు. ఇది నా అభ్యర్ధన కాదు డిమాండ్ అని ఆయన కొంచెం గట్టిగానే విన్నవించడం జరిగింది.
సినిమా పరిశ్రమలో కొత్తగా ఎటువంటి సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వచ్చిన వాటిని అందిపుచ్చుకొనిఆయన తెలుగు ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచారు అని చెప్పారు. ఆయనకు దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఇవ్వడం.. మనకు గౌరవం అని ఆయన కొనియాడారు. మరి మెగాస్టార్ చిరంజీవి, వేలకొలది అభిమానుల సమక్షంలో చేసిన అభ్యర్ధనను తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకుంటాయో.. లేదో చూడాలి. ఇక మహేష్ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలవుతుంది.
