సూపర్ స్టార్ కృష్ణ తన భార్య కన్నుమూసిన రోజు నుండి సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో తరచూ అతిధిలు కృష్ణ గారిని చూసేందుకు వస్తుంటారు. అయితే ఇదే సమయంలో మజిలీ చిత్రం తో హిట్ ట్రాక్ లోకి వచ్చిన దర్శకుడు శివ నిర్వాణ. నిన్ను కోరి, మజిలీ లాంటి క్లాస్ మూవీ లతో అలరించిన శివ నిర్వాణ సూపర్ స్టార్ కృష్ణ గారిని కలిసే అదృష్టం లభించింది. ప్రతిభావంతుడైన ఈ దర్శకుడు కృష్ణ గారిని కలవడం తో అతనితో గడపడం తో సంతోషాన్ని వ్యక్తం చేసారు. అయితే సోషల్ మీడియా లో ఒక ఫోటో ని పోస్ట్ చేస్తూ సూపర్ స్టార్ కృష్ణ గారి ఫై గౌరవాన్ని చూపించారు.
లెజెండరీ నటుడైన కృష్ణ గారిని కలవడం అదృష్టంగా బావిస్తున్నాని తెలిపారు. నేను ఎప్పటికీ మరిచిపోలేను అని అన్నారు. ఆ దేవుడు రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు సార్ అని శివ పోస్ట్ చేసారు. ప్రస్తుతం శివ నిర్వాణ టక్ జగదీశ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాని కథానాయకుడిగా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
