మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివల కొత్త చిత్రం షూటింగ్ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. కొరటాల డైరెక్షన్లో చిరు తొలిసారి చేస్తున్న సినిమా కావడం వలన ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ అంచనాల్ని మారింత పెంచేలా కొత్త వార్తలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ నటించనున్నారని జోరుగా వార్తలు మొదలయ్యాయి.
ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణలో ఉన్న చెర్రీ అది పూర్తికాగానే చిరు సినిమా చిత్రీకరణలో పాల్గొంటారట. కథ ప్రకారం చిరు యుక్తవయసు పాత్రను చరణ్ చేయనున్నారని, చిరు, చరణ్ మధ్య కాంబినేషనల్ సీన్స్ ఉండవని అంటున్నారు. మరి వీటిలో ఏమాత్రం వాస్తవముందో తెలియాలంటే చిత్ర బృందం స్పందించే వరకు ఆగాల్సిందే. కొణిదల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టెయిన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 14న విడుదల చేయనున్నారు.
