‘డాంగ్ డాంగ్’ పార్టీ సాంగ్‌ గా మిగిలిపోతుంది – తమన్నా

Tamannaah1

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడిల కలయికలో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ‘డాంగ్ డాంగ్’ అనే స్పెషల్ సాంగ్‌ లో మిల్క్ బ్యూటీ తమన్నా నటించింది. అయితే తాజాగా తమన్నా సాంగ్‌ కు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. అలాగే ఆ మేకింగ్ వీడియోలో తమన్నా ఈ సాంగ్ గురించి మాట్లాడుతూ.. ‘డాంగ్ డాంగ్’ సాంగ్ ఈ సంవత్సరం అంతా పార్టీ సాంగ్‌ గా మిగిలిపోతుంది. ఈ సాంగ్ లో నాకు ఛాన్స్ ఇచ్చిన అనిల్ రావిపూడికి థాంక్స్.. ఇక నేను ఆర్మీ వాళ్లతో డ్యాన్స్ చేయటం ఏంటని చాలా మందిలో డౌట్స్ ఉన్నాయి. అయితే సినిమా విడుదల తరువాత సాంగ్ చూసి అందరూ ఇష్టపడతారు అని తమన్నా చెప్పుకొచ్చింది.

కాగా ‘సరిలేరు నీకెవ్వరు’ టీం ప్రమోషన్స్ పనులను వేగవంతం చేసింది. ఇక ఇప్పటికే ట్రైలర్ ను రిలీజ్ చేసి ఆడియన్స్ కు బ్రహ్మండమైన కిక్ ఇచ్చింది. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న భారీ ఎత్తున విడుదలకానుంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version