ఈవెంట్ కి మెగాస్టార్ రావడం పై ఇంట్రస్టింగ్ న్యూస్ చెప్పిన మహేష్ !

MaheshBabu

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీవీ ఛానల్స్ కు మరియు వెబ్ మీడియాలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు.

అయితే ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ రావడం, ఈవెంట్ సూపర్ హిట్ అవ్వడం తెలిసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఈవెంట్ గురించి మహేష్ బాబు మాట్లాడుతూ.. ‘ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి చిరంజీవిగారు అతిథిగా రావాలని నేను ఎప్పుడో కోరుకున్నానని, ఈ సినిమా జరగడానికి మూడు నెలల ముందే ఈ ఈవెంట్ ను ప్లాన్ చేశానని మహేష్ చెప్పారు.

ఇక ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version