సూపర్ స్టార్ రజని యాక్షన్ ఎంటర్టైనర్ దర్బార్ నేడు విడుదలైంది. గత రాత్రి నుండే దర్బార్ చిత్ర ప్రీమియర్ షోలు యూఎస్ లో ప్రదర్శించబడుతున్నాయి. దర్బార్ చిత్రానికి అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ అందుతుంది. తాజా సమాచారం ప్రకారం యూస్ లో ప్రీమియర్ షోల ద్వారా దర్బార్ తమిళ వర్షన్ 4లక్షల డాలర్లు రాబట్టినట్టు సమాచారం. ఇంకా రోజు ముగియని నేపథ్యంలో ఈ ఫిగర్ మరింత పెరిగే అవకాశం కలదు. ప్రీమియర్స్ ద్వారానే దర్బార్ వన్ మిలియన్ వరకు రాబట్టే అవకాశం కలదు. తమిళ్ తో పాటు, మిగతా భాషల కలెక్షన్స్ కూడా కలుపుకుంటే ఈ ఫిగర్ ఇంకా ఎక్కవ ఉంటుంది.
దర్బార్ చిత్రంలో రజిని కాంత్ పోలీస్ అధికారి పాత్ర చేశారు . స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మురగదాస్ – రజిని కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం దర్బార్ కావడం విశేషం. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించగా, నివేదా థామస్ రజిని కూతురి పాత్ర చేయడం కొసమెరుపు. దర్బార్ చిత్రానికి సంగీతం అనిరుధ్ అందించారు.
