లక్ష్, దిగంగన సూర్యవంశీ జంటగా రమేష్ కదుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వలయం. సస్పెన్సు థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 21న విడుదల కానుంది. దీనితో హీరోయిన్ దిగంగన మీడియా సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలు పంచుకున్నారు.
ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి?
వలయం సినిమాలో నేను దిశా అనే ఓ సాంప్రదాయబద్దమైన గృహిణి పాత్ర చేశాను. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న దిశా అనుకోకుండా కనిపించకుండా పోతుంది. అసలు దిశా ఏమైంది? తాను ఎందుకు కనిపించడం లేదు? తనకు ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా? అన్న సస్పెన్సులో కథ నడుస్తుంది.
వలయం అనే టైటిల్ ఎందుకు పెట్టారు?
తాను ఎంతగానో ప్రేమించిన భార్య కనిపించడకుండా పోవడంతో, హీరో సమస్యలలో చిక్కుకుంటాడు. ఆయన చుట్టూ ఉన్న వారు భార్య గురించి తప్పుగా మాట్లాడుతుంటే అసలు నిజంగా ఏమైంది..? అనే కన్ఫ్యూషన్ లో ఉంటారు. అందుకే దీనికి వలయం అనే టైటిల్ పెట్టాము. ఈ కథకు వలయం అనే టైటిల్ చాల బాగా సూట్ అవుతుంది.
హిప్పీ సినిమా ఫలితం మీపై ఎలాంటి ప్రభావం చూపించింది?
కొన్ని విషయాలు మన కంట్రోల్ లో ఉండవు. మనం ఎంత ఎఫ్ఫార్ట్స్ పెట్టినా ఒక్కొక్కసారి ఫలితం దక్కకపోవచ్చు. మనం సినిమా తీసిన విధానం, దానిని ప్రేక్షకులు చూసే కోణం వేరుగా ఉండొచ్చు . హిప్పీ మూవీ సక్సెస్ కాకపోయినా నేను హ్యాపీ గానే ఉన్నాను. ఎందుకంటే ఆ సినిమాలో ఆడియన్స్ నన్నుయాక్సప్ట్ చేశారు.
తెలుగులో ఇంకేమి చిత్రాలలో నటిస్తున్నారు?
గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న సిటీమార్ సినిమాలో నటిస్తున్నాను. ఆ చిత్రంలో నేను ఆయన ప్రక్కన ఒక హీరోయిన్ గా నటిస్తున్నాను.
సినిమా కథలు కూడా రాస్తారా మీరు?
నేను రెండు సినిమా స్క్రిప్ట్స్ రాశాను, అవి నాకు ఎంతో ఇష్టం. పేరెంట్స్ కూడా నువ్వు వరుసగా సినిమాలు ఎందుకు రాయకూడదు అన్నారు. కథలు , స్క్రిప్ట్స్ రాయడం నాకు ఇష్టం.