లాక్ డౌన్ ఇంటర్వ్యూ సిరీస్ ను కొనసాగిస్తూ, ఈ రోజు, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ తో ప్రత్యేక ఇంటర్వ్యూను మీకు అందిస్తున్నాము. ‘స్నేహగీతం, ప్రస్థానం’ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు నటుడిగా పరిచయం అయినా సందీప్ కిషన్, హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. మరి సందీప్ కిషన్ తన కెయిర్ గురించి చెప్పిన విశేషాలేమిటో చూద్దాం.
లాక్ డౌన్ సమయంలో మీరు ఏమి చేస్తున్నారు ?
లాక్ డౌన్ లో కూడా నేను ఎక్కువగా పని చేస్తున్నాను. నా తదుపరి ప్రాజెక్టులు మరియు వాటి కథ చర్చలతో ప్రస్తుతం నేను బిజీగా ఉన్నాను. అలాగే ఎక్కువగా ఓటిటీలో షోస్ చూస్తున్నాను.
హిందీ, తమిళ సినిమాల్లో మీ కెరీర్ ఎలా ఉంది ?
నా బ్రేడ్ అండ్ బట్టర్ తెలుగు సినిమానే. అయితే ఇతర భాషలలో నేను నటిస్తున్నాను అంటే అది ఎదో సరదా కోసమే. ప్రతి ఒక్క నటుడు అన్ని భాషల్లో చేయాలని కోరుకుంటారు, నేను అంతే. అందుకే తమిళంలో అలాగే హిందీలో మరియు ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి షోలో చేశాను.
మీరు మీ సినిమాలకు ఎక్కువగా ప్రచారం చేస్తారని చాలామంది అంటున్నారు ?
నేను వారితో ఏకీభవించను. ఒక నటుడిగా, నేను నా సినిమాను ఎక్కువుగా ప్రచారం చేసుకుంటే తప్పు ఎలా అవుతుంది. నా సినిమాలను ప్రోత్సహించడం మరియు నేను ఏమి చేయబోతున్నానో అని అందరికీ తెలిసేలా చెప్పడం కూడా నా జాబే కదా .
మీ ప్రేమ జీవితం గురించి పెద్దగా ఎక్కడా వ్రాయబడలేదు. ఇంతకీ మీరు ఒంటరిగా ఉన్నారా లేక రిలేషన్ లో ఉన్నారా ?
నేను ప్రస్తుతం ఒంటరిగా ఉన్నాను. అయితే గత ఆరు సంవత్సరాలలో రెండు రిలేషన్ షిప్స్ లో ఉన్నాను. కానీ ప్రస్తుతానికి అయితే నేను నా కెరీర్ పైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించాను. అలాగే జీవితంలో స్థిరపడటానికి ఒక అమ్మాయి కోసం చూస్తున్నాను.
ఇప్పుడు మీ కెరీర్‌ను ఎలా ప్లాన్ చేస్తున్నారు?
నేను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాను. ప్రేక్షకుల అభిరుచిని సరిగ్గా అర్థం చేసుకున్నాను. నాలోని బెస్ట్ ఇంకా బయటకు రాలేదు, నా రాబోయే సినిమాలు ప్రజలు నన్ను చూసే తీరును కచ్చితంగా మారుస్తాయి. నేను నిర్మాతగా కూడా మారాను బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవుతుందని నిర్మాతగా కూడా రిస్క్ తీసుకుంటున్నాను.
A1 ఎక్స్‌ప్రెస్ గురించి చెప్పండి?
ఈ ప్రాజెక్ట్ చాలా ప్రత్యేకమైన నేపథ్యంతో చాలా కమర్షియల్ చిత్రంగా రానుంది. అందుకే నేను ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాను. ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ లుక్ లో మీరు నన్ను మొదటిసారి చూస్తారు. ఇక షూటింగ్ కోసం కేవలం 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ చిత్రం చాలా బాగా వచ్చింది.
మీకు మీ ఫ్యామిలీ నుండి ఎలాంటి మద్దతు ఉంది ?
నా కెరీర్ ప్రారంభంలో, నా నిర్ణయాలు చూసి నా తల్లిదండ్రులు భయపడ్డారు, కానీ ఇప్పుడు, నేను స్థిరపడిన విధానంతో వారు చాలా సంతోషంగా ఉన్నారు. నా సోదరి నుండి కూడా నాకు పెద్ద మద్దతు ఉంది.
మీరు బ్యాకప్ ప్లాన్‌గా హోటల్ బిజినెస్ లోకి వచ్చారా?
అవును, నా తల్లిదండ్రుల భద్రత మరియు వారి భవిష్యత్తు కోసమే బిజినెస్ స్టార్ట్ చేశాను. నా రెస్టారెంట్ బిజినెస్ భాగస్వామ్యంతో జరుగుతుంది. ఇతర నగరాలకు కూడా నా బిజినెస్ ను విస్తరించే ప్రణాళికలో ఉన్నాను.
మీ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ?
‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ త్వరలో రెడీ అవుతుంది, ఆపై మీకు బాగా తెలిసిన దర్శకుడితో ఒక ప్రాజెక్ట్ ఉంది, అది త్వరలో ప్రకటించబడుతుంది. అలా కాకుండా, లాక్ డౌన్ ముగిసిన తర్వాత నేను వెల్లడించే మరో రెండు ఆసక్తికరమైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.