
ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై పోరాటంతో జాతీయ స్థాయిలో పాపులారిటీని సంపాదించిన మీరా చోప్రా ఈ సారి బాలీవుడ్ పై విరుచుకుపడింది. ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కు క్షమాపణలు చెబుతూ పెద్ద పోస్ట్ ట్వీట్ చేసింది. ‘ఒకే ఇండస్ట్రీలో మనమందరం పనిచేస్తూ.. బతుకుతున్నాము. కానీ ఈ ఫీల్ ఇప్పుడు చాలా క్రూరమైనదిగా చాల బాధాకరమైనదిగా అనిపిస్తోంది. ఎందుకంటే సుశాంత్ చాలా కాలం నుంచి డిప్రెషన్‌తో బాధపడుతుంటే.. మనం అతను కోసం ఏం చేశాం ? అసలు అతని క్లోజ్ సర్కిల్, దర్శకులు, నిర్మాతలు వీళ్లంతా ఏం చేశారు? ఎందుకని ఒక్కరూ కూడా ముందుకు వచ్చి అతనిపై ప్రేమ చూపించలేదు. అతని విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదు.
ఒక సినిమా ప్లాప్ అయితే చాలు, ఈ ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకోరు. బాలీవుడ్ అనేది చిన్న కుటుంబం.. నిజమే కానీ అవసరం అయినప్పుడు ఈ కుటుంబంలో దయ అనేది కనిపించదు. ఈ కుటుంబం కోసం అతను ఎంతో బాధను అనుభవించాడు. మనిషి బాధలో ఉన్నప్పుడు పలకరించరు కానీ, చనిపోయిన తర్వాత సుదీర్ఘ సందేశాలు ఇస్తుంటారు. దాని వల్ల ఉపయోగం ఏముంది. సుశాంత్, నీ మృతితో నాకు సొంత వ్యక్తిని కోల్పోయిన భావన కలుగుతుంది. నీ విషయంలో అందరం ఫెయిల్ అయ్యాం. ఇండస్ట్రీ అంతా ఫెయిల్ అయింది. అందుకే ఇండస్ట్రీ తరుపున నీకు క్షమాపణలు తెలియజేస్తున్నాను..’’ అంటూ మీరా చోప్రా ఆవేశంగా ట్వీట్ చేసింది.
My apology to #sushant on behalf of the entire industry and a humble request to my industry folks!! pic.twitter.com/PJHhet6V6I
— Meerra Chopraa (@MeerraChopra) June 15, 2020