‘ఎక్స్‌పైరీ డేట్’ చేశాక వాళ్ల నుండి ఫోన్లు రావడం మొదలైంది – మధు షాలిని

madhu shalani

ఓటీటీల వినియోగం పెరిగాక వెబ్ సిరీస్‌ల హడావిడి ఎక్కువైంది. తెలుగు యువ దర్శకులు కొందరు వెబ్ సిరీస్‌లు రూపొందించి ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేస్తున్నారు. అలా వచ్చిన ఒక వెబ్ సిరీసే ‘ఎక్స్‌పైరీ డేట్’. తెలుగు, హిందీలో రూపొందిన మొట్టమొదటి వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం. జీ 5 ద్వారా అక్టోబర్ 2న హిందీ వెర్షన్, అక్టోబర్ 9న తెలుగు వెర్షన్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో నటి మధు షాలిని ఒక కీలక పాత్ర చేశారు. అందులో ఆమె నటనకుగాను తెలుగు, హిందీ పరిశ్రమల నుండిమంచి ప్రశంసలు అందుతున్నాయి. మధు షాలిని సైతం ఈ వెబ్ సిరీస్ ద్వారా తన కెరీర్ వేగం అందుకుందని అంటున్నారు.

హిందీ ప్రేక్షకుకు మొదట దీన్ని తెలుగు వెబ్ సిరీస్ అనుకున్నారని, కానీ విడుడలయ్యాక చూసి మెచ్చుకున్నారని, దర్శకుల నుండి ఫోన్లు వస్తున్నాయని, అవకాశాలు పెరిగాయని మధు షాలిని సంతృప్తి వ్యక్తం చేశారు. నిజ జీవితంలో తన పాత్రకు పూర్తి భిన్నమైన పాత్ర కావడంతో చాలా వెబ్‌ సిరీస్‌లు చూసి ఫీమేల్‌ క్యారెక్టర్లు మాత్రమే కాకుండా మేల్‌ క్యారెక్టర్ల నుండి కూడ రిఫరెన్స్‌ తీసుకుని చేశానని మధు షాలిని అంటోంది.

నలుగురు విభిన్న వ్యక్తుల కథలను, రిలేషన్షిప్స్‌ని ఆకట్టుకునేలా చూపిన ఈ వెబ్ సిరీస్‌కు సీక్వెల్ ఉండవచ్చట. ఇలాంటి మంచి పాట్రలు వస్తే ఎవరూ తనను ఒప్పించాల్సిన పనిలేదని, తానే నటించడానికి వెళతానని అంటున్న మధు షాలిని కథ బాగుంటే మరిన్ని వెబ్ సిరీస్‌లలో నటిస్తానని, తనను దృష్టిలో పెట్టుకుని పాత్రలు రాసుకోవచ్చని హింట్ ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె ‘బాహుబలి’ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ప్రొడ్యూస్‌ చేస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘రైజ్‌ ఆఫ్‌ శివగామితో పాటు ‘గూఢచారి 2’, ఒక తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం, మరో రెండు తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు.

Exit mobile version