ప్రభాస్ సినిమాకు కేవలం ఇలానే ప్లాన్ చేస్తున్నారా.?

Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఇపుడు మంచి హాట్ టాపిక్ గా నడుస్తుంది మాత్రం నాగశ్విన్ తో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ అనే చెప్పాలి. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం లో భారతదేశం గర్వించదగ్గ లెజెండరీ నటులు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారని చిత్ర యూనిట్ నిన్ననే గర్వంగా ప్రకటించింది.

అయితే ఈ సినిమాకు సంబంధించి క్యాస్టింగ్ పరంగా ఉన్నతంగా మాత్రమే ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు అర్ధం అవుతుంది. ఈ చిత్రంలో ఒక్క బిగ్ బి మాత్రమే కాకుండా మరింత మంది అగ్ర గామి నటులు కూడా ఉండేలా నాగశ్విన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వీరు అనౌన్స్ చేసిన అమితాబ్ ప్రకటన వీడియో జస్ట్ కొద్ది గంటల్లోనే యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ కు వచ్చేసింది అంటే ఈ అప్డేట్ ఎంత ఇంపాక్ట్ కలిగించిందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె నటిస్తుండగా అశ్వనీదత్ 500 కోట్ల మేర భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.

Exit mobile version