కొత్త టాలెంట్ కు ఎప్పుడూ తెలుగు సినిమా తలుపులు తెరచే ఉంటాయి అలాగే సినిమా ప్రపంచం అనేది పుష్పక విమానం లాంటిది. అందులోకి ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి చోటు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. “శేఖరం గారబ్బాయి” చిత్రంతో తెలుగు సినిమా పుష్పక విమానం ఎక్కిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో “విన్ను మద్దిపాటి”.
ఇప్పుడందులో తనకంటూ ఓ చిన్న స్థానం కోసం ట్రై చేస్తున్నాడు. అందుకే ‘లీడ్ హీరోల’ జాబితాలో చేరేందుకు అవసరమైన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న విన్ను మద్దిలేటి.. “రేవ్ డి’ అనే వెబ్ సిరీస్ తో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అన్ని వర్గాల ఆడియన్స్ హార్ట్స్ విన్ చేయడమే తన గోల్ అని ఈ యూయూన్గ్ హీరో అంటున్నాడు. అలాగే తాను హీరోగా నటిస్తున్న “గ్రంధాలయం, వైరం” చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.
