నెపోటిజం మీద మెగా ఫ్యామిలీ హీరో ఏమన్నాడంటే..

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుండి తరచు వారసులు హీరోలుగా ఇండస్ట్రీలోకి వస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ మొదలుకుని రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, ధరమ్ తేజ్ ఇలా ఏడెనిమిది మంది హీరోలు వచ్చారు. అందరూ సినిమాలు చేస్తున్నారు. తాజాగా ‘ఉప్పెన’తో వైష్ణవ్ తేజ్, ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ చిత్రంతో పవన్ తేజ్ కొణిదెల హీరోలుగా పరిచయం కానున్నారు. ఇలా వరుస పెట్టి హీరోలు వస్తుండటంతో ఇండస్ట్రీ మొత్తం మెగా ఫ్యామిలీ డామినేషన్ పెరిగిపోతోందనే విమర్శలు నిత్యం వస్తూనే ఉన్నాయి. వారసుల మూలాన నేపోటిజం పెరిగిపోయిందని, బయటివారికి అవకాశాలు రావట్లేదని అనేవారు చాలామందే ఉన్నారు.

అయితే వీరికి పవన్ తేజ్ కొణిదెల సున్నితమైన సమాధానం ఇచ్చాడు. మెగా ఫ్యామిలీ నుండి తాను హీరోగా రావడం వలన వేరే కొత్త హీరోకు అవకాశం మిస్సవద్దన్న ఈ యువ హీరో నేపోటిజమ్ అంత ఉండి ఉంటే విజయ్ దేవరకొండ లాంటి స్టార్ వచ్చేవారా, గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే ఆయనతో సినిమా తీశారు. నేను మెగా ఫ్యామిలీ నుండే వచ్చాను. కానీ నా సినిమా చేస్తున్న నిర్మాత, మా దర్శకుడు అభి, టెక్నీషియన్లు, హీరోయిన్ ఇలా కొత్తవాళ్లే . ఈ సినిమాతో అందరికీ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం దొరికినట్టే కదా. ఇంత కొత్త టాలెంట్ మా సినిమాతో వర్క్ దొరికింది. అలా ఎందుకు ఆలోచించరు. అలాంటప్పుడు ఇది నేపోటిజం ఎలా అవుతుంది. చిరంజీవిగారు, చరణ్ అన్నయ్య సినిమాలు చేయడం వలన ఎంతో మంది వర్క్ దొరుకుతోంది. అలా అందరు హీరోలు చేయడం వలన చాలామందికి పని ఉంటుంది కదా’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.

Exit mobile version