ఊరి సెట్ లో ‘ఆచార్య’ షూటింగ్ !

Acharya1

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’. హైదరాబాద్‌ శివార్లలో వేసిన ఊరి సెట్ లో జనవరి 16 నుండి షూట్ మొదలుపెట్టనున్నారు. ఇక రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపిస్తారనే విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా తీసుకున్నారు. 16 నుండి మొదలయ్యే షూట్ లో కాజల్ పాల్గొననుంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట. అలాగే ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా కోసం సారథి స్టూడియోలో ఓ పురాతన దేవాలయం సెట్ వేస్తున్నారని.. ఈ సెట్ లో మెగాస్టార్ పై సాంగ్స్ షూట్ చేస్తారని తెలుస్తోంది.

Exit mobile version