“మాస్టర్” అక్కడ కూడా బిగ్గెస్ట్ రిలీజ్ అట.!

Master 4

ఇళయ థలపతి విజయ్ హీరోగా మాళవికా మొహనన్ హీరోయిన్ గా మక్కల్ సెల్వన్ సాలిడ్ విలన్ రోల్ లో నటించిన తాజా చిత్రం “మాస్టర్”. లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ భారీ చిత్రం ఇప్పుడు సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు రెడీ అవుతుంది. మరి ఇదిలా ఉండగా ఓవర్సీస్ లో పలు ప్రాంతాల్లో అయితే బిగ్గెస్ట్ ఎవర్ తమిళ్ సినిమా రిలీజ్ గా ఇది అవుతుందట.

అలా ఇటీవలే ఆస్ట్రేలియాలో ఇప్పటికే రికార్డు స్థాయి సంఖ్యలో మరియు ప్రీ బుకింగ్స్ లో రికార్డ్ సెట్ చేసింది. మరి ఇప్పుడు అలాగే న్యూజిలాండ్ లొకేషన్ లో కూడా మాస్టర్ అత్యధిక థియేటర్స్ లో విడుదల అవుతున్నట్టు తెలుస్తుంది. సౌతెర్న్ ఇంటెర్నేషల్ వారు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా మాత్రం మాస్టర్ ప్రపంచ వ్యాప్తంగా సాలిడ్ గా విడుదల అవుతుంది. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version