మెగాస్టార్ తన ప్లానింగ్ మార్చుకున్నారా.?

Chiranjeevi 1

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అలాగే దీని తర్వాత చిరు రెండు రీమేక్ సినిమాలను లైన్ లో పెట్టుకున్నారు. మరి అలాగే ఆచార్య లైన్ లో ఉండగానే టేకప్ చేసిన ఈ రెండు రీమేక్ సినిమాల విషయంలో ఒక్కో సమయానికి ఒక్కో విధంగా పరిస్థితులు మారాయి. ముఖ్యంగా “లూసిఫర్” రీమేక్ విషయంలో అయితే పెద్ద డ్రామానే నడిచింది.

పలు దర్శకుల నుంచి మారడమే కాకుండా తర్వాత టేకప్ చేసే ప్రాజెక్ట్ నుంచి చేంజ్ అయ్యి “వేదాళం” మొదటి వరుసలోకి వచ్చింది. ఇక అదే అనుకుంటే ఇప్పుడు చిరు మళ్ళీ తన ప్లాన్ ను మార్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు చిరు ఆచార్య కంప్లీట్ అయ్యాక మొదట లూసిఫర్ రీమేక్ నే టేకప్ చెయ్యాలని భావిస్తున్నారని టాక్. దాని తర్వాతనే వేదాళం రీమేక్ స్టార్ట్ చేయనున్నారట. మరి చిరు మొదట ఏ ప్రాజెక్ట్ ను టేకప్ చేయనున్నారో చూడాలి.

Exit mobile version