ఫైనల్ గా రానా “అరణ్య”కు రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.!

Rana Arany

మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న పలు ఆసక్తికర చిత్రాల్లో “అరణ్య” సినిమా కూడా ఒకటి. పలు కీలక భాషల్లో ప్లాన్ చేసిన ఈ చిత్రం నిజానికి గత ఏడాది ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావం మూలాన ఈ చిత్రం విడుదల ఆగిపోయింది. ఇక అలాగే మరోపక్క ఓటిటి ఊపందుకునేసరికి ఈ చిత్రం కూడా అలానే వస్తుంది అని చాలా మంది అనుకున్నారు.

కానీ మేకర్స్ తమ సబ్జెక్టు పై ఉన్న నమ్మకంతో థియేట్రికల్ విడుదలకే ఫిక్స్ అయ్యారు. సో ఫైనల్ గా స్వయంగా రానానే తన సినిమా విడుదల తేదీని ప్రకటించేసారు. ఈ చిత్రాన్ని మొత్తం మూడు భాషల్లోనూ వచ్చే మార్చ్ 26న థియేటర్స్ లో విడుదల చేస్తున్నామని తెలిపారు.ఇక ఈ చిత్రాన్ని ప్రభు సాల్మోన్ తమిళ్ మరియు తెలుగు భాషల్లో ఏక కాలంలో తెరకెక్కించగా సంతాను మొయిత్రా సంగీతం అందించారు. అలాగే ఈరోస్ ఇంటెర్నేషనల్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

Exit mobile version