రామ్ “రెడ్” ఏ రేంజ్ రిలీజో తెలిస్తే దిమ్మ తిరుగుద్ది!


మన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మాల్వికా శర్మ హీరోయిన్ గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “రెడ్”. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు సంక్రాంతి రేస్ లో విడుదలకు రెడీ అవుతుంది. లాక్ డౌన్ మూలాన ఎన్నో అడ్డంకుల నడుమ ఫైనల్ గా థియేట్రికల్ రిలీజ్ కు ఫిక్స్ అయ్యింది.

అయితే ఈ చిత్రంకు సంబంధించి ఇప్పుడు మరో ఆసక్తికర వార్త వినిపిస్తుంది. మేకర్స్ ఈ సినిమాను ఒక్క తెలుగు భాషలో మాత్రమే రిలీజ్ చేయట్లేదట ఏకంగా ఏడు భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్నట్టుగా తెలుస్తుంది. తెలుగు,హిందీ,కన్నడ,మళయాళం అలాగే బెంగాళీ, మరాఠీ, భోజ్ పూరి భాషల్లో విడుదల అవుతుందట.

రామ్ కెరీర్ లో ఏ సినిమా కూడా ఈ రేంజ్ రిలీజ్ అయ్యింది లేదు. మరి మన దగ్గర మంచి అంచనాలు అందుకున్న ఈ చిత్రం ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందివ్వగా స్రవంతి రవి కిషోర్ నిర్మాణం వహించారు.

Exit mobile version