మన దక్షిణాది సినిమా నుంచి ఎప్పటి నుంచో అలా మోస్ట్ అవైటెడ్ టీజర్ గా నిలిచి ఉంది. “కేజీయఫ్ చాప్టర్ 2” టీజర్. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ ల కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో దాని కోసం ఇండియన్ వైడ్ ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో ఇప్పుడు తేలిపోయింది.
పక్కా మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ భారీ పాన్ ఇండియన్ సినిమా టీజర్ ను మేకర్స్ యష్ పుట్టినరోజు సందర్భంగా కాస్త ముందే విడుదల చేసారు. అలా చేశారో లేదో ఈ సినిమా ఫ్యాన్స్ మాస్ హిస్టీరియా అంటే ఏంటో రుచి చూపించేశారు. సడెన్ గా రాత్రి 9 గంటల 29 నిమిషాల సమయంలో విడుదల కాగా కేవలం 79 నిమిషాల్లో 1 మిలియన్ లైక్స్ కొల్లగొట్టేసి ఏకంగా వరల్డ్ రికార్డ్ నే సెట్ చేసినట్టు తెలుస్తుంది.
అంతే కాకుండా ఇప్పుడు కేవలం 9 గంటల్లోనే 15 మిలియన్ కి పైగా వ్యూస్ మరియు 1.8 మిలియన్ లైక్స్ తో మరో సెన్సేషనల్ రికార్డులను ఈ టీజర్ ఖాతాలో వేసేసుకుంది. దీనిని బట్టి ఈ సినిమా అంటే మాస్ ఆడియెన్స్ అన్ని భాషల నుంచి ఏ రేంజ్ కసి మీద ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.
ఇండియాలోనే ఏ సినిమాకు ఇవ్వని రేంజ్ రెస్పాన్స్ ఇప్పుడు “కేజీయఫ్ చాప్టర్ 2” కి ఇచ్చారు. ఇది జస్ట్ టీజర్ మాత్రమే.. మరి ముందు వచ్చే ట్రైలర్ మరియు సినిమాలకు ఏ స్థాయి రికార్డులు అందిస్తారో ఊహించడం కూడా కష్టమే మరి.మొత్తానికి మాత్రం మాన్స్టర్ టీజర్ కి రెస్పాన్స్ మామూలుగా లేదని చెప్పాలి.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
