దెబ్బకు ఒక్కసారిగా పెరిగిపోయిన ప్రభాస్ సినిమాపై అంచనాలు.!

salaar 1

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర మెయిన్ టాక్ అంతా “కేజీయఫ్ చాప్టర్ 2” టీజర్ కోసమే..రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మైండ్ బ్లోయింగ్ మాస్ చిత్రం నుంచి వచ్చిన ఈ టీజర్ కోసమే అంతా రచ్చ నడుస్తుంది. ఊహించని రీతి విజువల్స్ లో టీజర్ ను చూపించి ఈ సినిమా టీజర్ కోసం ఎదురు చూస్తున్న మాస్ ఆడియెన్స్ మతులు పోగొట్టేసాడు ప్రశాంత్ నీల్. ముఖ్యంగా యష్ పై చూపించిన షాట్స్ చూసి అయితే ఇతర హీరోల అభిమానులు స్టన్ అయ్యిపోయారు.

దీనితో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది అసలు టాక్. దీని తర్వాత నీల్ మరియు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఓ సినిమా రానుంది. అదే “సలార్” దీనిని కూడా ఏమాత్రం తగ్గకుండా భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నారు. దీనితో అనౌన్స్మెంట్ తోనే భారీ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రంపై అంచనాలు ఇప్పుడు కేజీయఫ్ 2 టీజర్ చూసాక ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి.

ఇక ఇదే ఇలా ఉంటే నీల్ సలార్ ఏ స్థాయిలో డిజైన్ చేస్తాడా అన్న టాక్ మొదలయ్యింది. ఇప్పటికే సలార్ లోని ప్రభాస్ రోల్ ను మోస్ట్ పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేశారు. మరి సలార్ లో ప్రభాస్ పై ఎలివేషన్స్ ఖచ్చితంగా అంతకు మించే ఉంటాయని ప్రభాస్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యిపోయారు. మరి నీల్ ఎలా చూపిస్తారో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ప్రస్తుతం అయితే రెబల్ ఫ్యాన్స్ రాధేశ్యామ్ టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Exit mobile version