మాంచి ఇంట్రెస్టింగ్ టేకింగ్ ఉన్న టాలెంటెడ్ దర్శకుల్లో మన దగ్గర విక్రమ్ కె కుమార్ ఒకరు. సీన్, సీన్ కు లింక్ చేస్తూ చూపే తన టేకింగ్ ఆడియెన్స్ కి ఎప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అలా “మనం”, “24” లాంటి వండర్ చిత్రాలు తీసిన విక్రమ్ ఇప్పుడు అక్కినేని యువ హీరో నాగ చైతన్యతో తీస్తున్న “థ్యాంక్యూ ది మూవీ” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
అయితే ఇటీవలే అనౌన్సమెంట్ వచ్చిన ఈ చిత్రంపై కొన్ని ఆసక్తికర వార్తలే ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇందులో చైతు ఒక హాకీ ప్లేయర్ గా కనిపిస్తాడని అలాగే సూపర్ స్టార్ మహేష్ హార్డ్ కోర్ ఫ్యాన్ గా కనిపించనున్నాడని టాక్స్ వచ్చాయి. మరి ఇంకా అలాగే ఇప్పుడు తాజా బజ్ ప్రకారం ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంతా తో పాటుగా మరో ఫీమేల్ లీడ్ లో యంగ్ బ్యూటీ అవికా గోర్ కూడా కనిపించనుంది టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.
