ఈసారి ఫ్యామిలీ సబ్జెక్ట్ టచ్ చేస్తున్న మెగాస్టార్

Chiranjeevi 1
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుండి పక్క కమర్షియల్ సినిమాలే చేస్తూ వస్తున్నారు. ‘ఖైదీ నెం 150’ లాంటి సాలిడ్ కమర్షియల్ సినిమా చేసిన ఆయన ఆతర్వాత ‘సైరా’ లాంటి పిరియాడికల్ సినిమా చేసి మెప్పించారు. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చేస్తున్నారు. ఇది సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ చిత్రం. దీని తర్వాత చేయనున్న మెహర్ రమేష్, మోహన్ రాజాల రీమేక్ సినిమాలు కూడ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నవే. ఇలా వరుసగా అన్నీ కమర్షియల్ కథలే చేస్తున్న ఆయన ఈసారి మాత్రం ఫ్యామిలీ సబ్జెక్ట్ టచ్ చేస్తున్నారు.

బాబీ దర్శకత్వంలో చేయనున్న సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడ ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ. చిరుకు అన్ని వర్గాల్లోనూ అభిమానులున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యాన్ బేస్ కూడ ఎక్కువే. గతంలో ఆయన చేసిన కుటుంబ కథా చిత్రాలు మంచి విజయాలను సాదించాయి. మరి బాబీ సినిమా కూడ ఆ తరహాలోనే ఉంటుందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇంకొన్ని నెలల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Exit mobile version